6, డిసెంబర్ 2017, బుధవారం

మారణకాండ

// మారణకాండ //

" యత్ర నార్యస్తు పూజ్యంతే.... "
అరిగిపోయిన రాతలకో ఫోర్ వర్డ్ అయిపోతుంది
"ధర్మేత్వయా ఏషా నాతిచరితవ్య" బాసలు
ఆమె కిరోసిన్ దేహానికో అగ్నిహోత్రం
శుక్రకణం మాత్రమే నిరూపించగలిగే మగతనం

విక్టిమ్స్ కి నీతులు చెప్పే లోకమిపుడు,
ఐదేళ్ళ ఆడపిల్లలు ఏ బట్టలేసుకోవాలో నేర్పటానికి
ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెడుతుంది
ఈలోగా, రోడ్డు మీద నెత్తరోడుతున్న ఓ పిచ్చిది
మతిస్థిమితం లేనందుకు మెుదటిసారిగా నవ్వి,
శవమైపోతుంది

చట్టం గాంధారీతనానికి ఆనందపడుతుంది
ప్రతిఘటించలేని ద్రౌపదుల ఆర్తనాదాలు గాలిలో
కలిసిపోతాయి
ఇంకేం రండి మరి! యోనుల రక్తాక్షరాలు ఉదయం పేపర్లో చదువుకుందాం, ఎప్పట్లాగే...హ్మ్!

-సరిత భూపతి
6/12/17

1 కామెంట్‌:

  1. మద గజాల్ని అంకుశంతో పొడిచినట్టు
    ఖడ్గమృగాల్లాంటి మానవమృగాల చేతిలో నెత్తురోడుతున్న అతివల్ని చూసికూడా
    పూడుపాముల్లా నిద్దరోతున్న సత్తువ జచ్చిన సోంబేరుల్ని శూలంతో వెంటాడుతున్న శాంభవీమాతలా కనిపిస్తున్నాయి, ఇది చదువుతూ మీ ముఖ కవళికలు ఊహించుకుంటుంటే ..

    రిప్లయితొలగించండి